ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను రవాణాను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో వందకుపైగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని హడ్డుబంగి వద్ద సరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ గుట్కా ప్యాకెట్ల వాహనం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం వెళ్తుండగా కోమర్తి కూడలి వద్ద పోలీసులు అటకాయించి పట్టుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని నరసన్నపేట సీఐ తిరుపతి రావు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన వాహనం, గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు సీఐ తెలియజేశారు.
ప్రైవేటు అంబులెన్స్‌లో గుట్కా, ఖైనీ ప్యాకెట్ల రవాణా - gutka packets caught in private ambulance in srikakulam district
అంబులెన్స్.. బయటకు చూసేందుకు కలరింగ్ అలానే ఉంటుంది.. కానీ అసలు విషయం మేడిపండును పోలి వలే ఉంది. అందులో వైద్య పరికరాలు లేవు. ఉండేవి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు మాత్రమే. గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్న వీటిని హడ్డుబంగి వద్ద ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
![ప్రైవేటు అంబులెన్స్‌లో గుట్కా, ఖైనీ ప్యాకెట్ల రవాణా private ambulance taking gutka khaini packets caught](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9366491-653-9366491-1604050716454.jpg)
గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న నరసన్నపేట పోలీసులు