శ్రీకాకుళం జిల్లాలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పనుల పట్ల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాడు- నేడుపై ఆయన సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రతీ అంశం కంప్యూటరీకరణ జరుగుతుందని తెలిపారు.
'అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనకు ప్రయత్నాలు' - మనబడి నాడు-నేడుపై సమీక్ష
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మనబడి నాడు-నేడుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మనబడి నాడు-నేడుపై సమీక్ష
మురపాక, చిలకపాలెంలో ఈ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. మార్చి నెలాఖరులోగా జిల్లాలో 1,249 పాఠశాలల్లో పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్నారుల ప్రాథమిక హక్కులను ఈ కార్యక్రమం ద్వారా కాపాడుతున్నామని రాజశేఖర్ అన్నారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్