Pre-Sankranti festival in various districts in AP: రాష్ట్రంలో సంక్రాంతి పండగ శోభ ముందుగానే వచ్చింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ముందస్తుగా పండగను నిర్వహించారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని వివిధ కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టిపడేశాయి. కళాశాలలో రంగవల్లులతో యువతులు తమ ప్రతిభను చాటుకోగా.. యువకులు పట్టు పంచలతో దర్శనమిచ్చారు. భోగి మంటలను పేర్చి మందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాచుర్యాన్ని వివరించే విధంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు చేపట్టారు. భోగి మంటలు కొత్త బియ్యంతో పాయసం వంటకాలు నిర్వహించారు. కోలాటంతో విద్యార్థులు సందడి పంచుకున్నారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు భాష్యం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బోగి మంటలు, రంగు రంగుల ముగ్గులతో విద్యార్థులు సందడి చేశారు.. అటపాటలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.