ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొందూరు ఎస్సై సస్పెన్షన్​.. ఫోన్​ సంభాషణ ఆధారంగా ఎస్పీ చర్యలు

పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మహిళతో ఎస్సై రామకృష్ణ ఫోన్ సంభాషణలు కలకలం రేగాయి. మహిళను ఎస్సై ఇంటికి రమ్మన్నట్లు ఫోన్‌లో సంభాషణలు ఉన్నాయనే ఆరోపణతో విచారణకు అదేశించిన ఎస్పీ అమిత్ బర్దార్.. ఎస్సై రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

By

Published : Aug 25, 2020, 11:28 AM IST

ponduru si suspension because of phone talk with lady says sp
ఎస్పీ అమిత్​ బర్దార్

మద్యం కేసులో పట్టుబడ్డ ఓ మహిళను తన ఇంటికి రావాలంటూ పొందూరు ఎస్సై ఫోన్​లో మాట్లాడిన సంభాషణ ఆధారంగా ఎస్పీ అమిత్​ బర్దార్​ సోమవారం ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పొందూరు మండలం రాపాక కూడలి సమీపంలోని కుమ్మరి కాలనీలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో మద్యం అక్రమ నిల్వలను శనివారం సాయంత్రం ఎస్సై కె. రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మాపీ చేసేందుకు తనను పొందూరులోని ఆయన ఇంటికి రమ్మని ఎస్సై కోరినట్లు నిందితురాలు ఆరోపించారు. ఫోన్​ ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేసింది. దీని ఆధారంగా ఎస్సైపై... ఎస్పీ చర్యలు చేపట్టారు. ఈ విషయమై విచారణ అధికారిగా శ్రీకాకుళం 'దిశ' పోలీస్​ స్టేషన్​ డీఎస్పీ మూర్తిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు జేఆర్​పురం సీఐ హెచ్​. మల్లేశ్వరరావు తెలిపారు. ఎచ్చెర్ల ఎస్సై రాజేష్​కు పొందూరు ఇన్​ఛార్జ్​ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details