నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతుంటే తమను అడ్డుకోవడం ఏంటని పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు.
నేతలు విడుదల..