తొలుసూరుపల్లిలో ఒడిశా మద్యం పట్టివేత - తొలుసూరుపల్లిలో పోలీసుల తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా తొలుసూరుపల్లి రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యంను అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యంను పోలీసులు పట్టుకున్నారు. రెండుసార్లు కంటే ఎక్కువగా మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ట్రైనీ డీఎస్పీ శ్రీలత హెచ్చరించారు.
![తొలుసూరుపల్లిలో ఒడిశా మద్యం పట్టివేత police take over odisa alcohol at tolusurupalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8425094-157-8425094-1597443347958.jpg)
శ్రీకాకుళం జిల్లా తొలుసూరుపల్లి రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యంను అక్రమంగా తరలిస్తున్న ఒడిశా మద్యంను పోలీసులు పట్టుకున్నారు. చింతలగార గ్రామానికి చెందిన పంగ కోటేశ్వరరావు, గేదెల జాసకిరామయ్యలను అరెస్ట్ చేశామని ట్రైనీ డీఎస్పీ శ్రీలత తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.29,525 విలువైన 47 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని.. మారుతి వ్యాసును సీజ్ చేశామన్నారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది కొరత ఉందని. ఇదే అదనగా అక్రమార్కులు మద్యం రవాణా చేస్తున్నారని అన్నారు. స్థానికులు అక్రమ వ్యాపారం పై సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.రెండుసార్లు కంటే ఎక్కువగా మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డ నిందితులపై రౌడీషీట్లుతెరుస్తామని ఆమె హెచ్చరించారు.
ఇదీ చూడండి.దేశప్రజలందరికీ చంద్రబాబు, లోకేశ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు