ఒడిశా నుంచి 229 మంది రాష్ట్ర వాసులు.. 11 బస్సుల్లో బయల్దేరారు. ఒడిశాలోని బలగం ప్రాంతంలో గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ శిక్షణకు సంబంధించి... ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన 229 మంది యువతీ యువకులు ఉన్నారు.
ఒడిశాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా.. వీరంతా అక్కడి నుంచి తమ ప్రాంతాలకు బయలుదేరారు. వీరికి రాష్ట్రానికి రావటానికి ఎలాంటి అనుమతులు లేవంటూ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. తమను వెళ్లనివ్వాలంటూ వారంతా ఆందోళన చేశారు. ఉన్నతాధికారు చెప్పినట్టు చేస్తామని పోలీసులు బదులిచ్చారు.