శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కోమనపల్లిలో కాశీవిశ్వేశ్వర ఆలయం ఘటనలో.. ఇద్దరు ఒడిశా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్‌బర్దార్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. హిరమండలం కొమనాపల్లి గ్రామ శివారులో కొందరు గుర్తుతెలియని నేరస్థులు కాశీవిశ్వేశ్వర ఆలయానికి చెందిన గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడ్డారన్నారు.
అదే సమయంలో వారివద్దనున్న పురాతన నాణేలు పడిపోయాయనీ... ఈ ఘటనపై హిరమండలం పోలీసుస్టేషన్‌లో గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాలకొండ డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో ఎస్‌ఐ మధుసూదనరావు సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేశారన్నారు. వాటి ఆధారంగా ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి 50 పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నామన్నారు.