శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కొత్తకుంకాం గ్రామం సమీపంలో ఉన్న మామిడి తోటలో నిర్వహింస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 33 వేలు నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 12 చరవాణిలు, 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసులు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కరోనా అయితే మాకేంటీ.. మా ఆట మాదే - Police raid on poker base at srikakulam news
ఒక వైపు కరోనా మహమ్మరి రోజు రోజుకు విజృంభిస్తుడడంతో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా ఎవరు లెక్క చేయడం లేదు. రహదారులు, గ్రామాల్లో కొంత మంది విచ్ఛలవిడిగా తిరుగుతూ గుంపులు గుంపులుగా ఆటలాడుతున్నారు.
పేకాట స్థావరంపై పోలీసులు దాడులు
ఇవీ చూడండి..