Police Traced Missing Baby at KGH Vishaka: విశాఖ కేజీహెచ్‌లో 5 రోజుల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగి వద్ద లభ్యమైంది. పోలీసుల తనిఖీల్లో భాగంగా చిన్నారిని గుర్తించారు. ఈకేసులో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పసిపాపను తల్లికి అప్పగించేందుకు విశాఖ తీసుకొస్తున్నారు. విశాఖలో ఐదు రోజుల శిశువు అపహరణకు గురవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇద్దరు మహిళలు.. చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. శ్రీకాకుళం జిల్లా జర్జంగి వద్ద చిన్నారిని గుర్తించారు.
అసలేం జరిగింది..
baby abducted at KGH Vishaka: పద్మనాభం మండలం రౌతుపాలేనికి చెందిన అప్పాయమ్మ ఈనెల 13న కేజీహెచ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం రాత్రి 7.25 గంటల సమయంలో ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు ఒకరు నర్సులా, మరొకరు ఆయాలా వచ్చి పాపను పరీక్షించాలని చెప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పయమ్మకు అనుమానం వచ్చి తన బంధువులను పంపిస్తామని చెప్పగా, వారి అవసరం లేదని చెప్పి పాపను బలవంతంగా తీసుకువెళ్లారు. సమయం దాటుతున్నా బిడ్డను తీసుకురాకపోవడంతో తల్లి కంగారుపడింది. పాపను తీసుకెళ్లిపోయారని గుర్తించి కేకలు వేసింది.
ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకొని పసికందు అపహరణకు గురైనట్లు గుర్తించి స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా ఒక మహిళ హడావుడిగా బిడ్డను తీసుకువెళ్తున్నట్లు అందులో రికార్డు అయింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇద్దరికి మించి పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తుస్తున్నారు. క్యాజువల్టీ నుంచి బయటకొచ్చిన వారు కేజీహెచ్ గేటు వద్ద ఆటో ఎక్కినట్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
Baby Abducted: విశాఖ కేజీహెచ్‌లో కలకలం.. నర్సులా వచ్చి..