శ్రీకాకుళంలో తెదేపా నేత కూన రవికుమార్ ఇంటి వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించడం చర్చనీయాంశమైంది. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజు రాత్రి రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గీయులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కూన రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. రవికుమార్ ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. పోలీసుల తీరుపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల మండిపడ్డారు.
తెదేపా నేత కూన రవికుమార్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు - TDP leader Koona Ravikumar latest news
తెదేపా నేత కూన రవికుమార్ ఇంటి వద్ద ఒక్కసారిగా పోలీసులు మోహరించటంతో చుట్టుపక్కల వారు గందరగోళానికి గురయ్యారు. శ్రీకాకుళంలోని పెనుబర్తిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో.. అతన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

తెదేపా నేత కూన రవికుమార్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు