పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలని డీఐజీ ఎల్కేవీ రంగారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా భద్రత' అనే అంశంపై పోలీస్ శాఖ.. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ.. సమాజంలో తల్లి స్థానం గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, అదనపు ఎస్పీలు, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
'పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి' - police department latest news in srikakulam district
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళ భద్రత' అనే అంశంపై శ్రీకాకుళంలో పోలీస్ శాఖ సదస్సును నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ.. పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.
'పురుషునికి కంటే మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలి'