గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఏఆర్ పోలీస్ మైదాన ప్రాంగణంలో ఉన్న డంపింగ్‌యార్డ్ వద్ద అక్రమ రవాణా చేసిన గంజాయిని దగ్ధం చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు పర్యవేక్షణలో.. మెళియాపుట్టి, కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని తనిఖీ చేశారు. జిల్లాలో 2019-2020 సంవత్సరానికి సంబంధించి నాలుగు కేసులుల్లో సుమారు 9 వందల 87 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. వీటి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని విశాఖట్నం రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు.
ఎచ్చెర్లలో గంజాయి రవాణా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా - శ్రీకాకుళం జిల్లాలో గంజాయి దగ్ధం చేసిన పోలీసులు
గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఏఆర్ పోలీస్ మైదాన ప్రాంగణంలో ఉన్న డంపింగ్‌యార్డ్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని దగ్ధం చేశారు.

ఎచ్చెర్లలో గంజాయిని దగ్దం చేసిన పోలీసులు