శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో తెలుగుదేశం శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి నందిగాం మండలంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే అట్టాడ జనార్ధన నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదని సీఐ వెంకట గణేష్ చెప్పడంతో అచ్చెన్నాయుడు పోలీసుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విగ్రహాల ఆవిష్కరణకు వెళ్తుంటే అనుమతి ఎందుకని నిలదీశారు. అనంతరం టెక్కలి మీదుగా నందిగాం వరకు ర్యాలీ జరిపారు.
తెదేపా ద్విచ్రక్ర వాహన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో తెలుగుదేశం శ్రేణుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలసి నందిగాం మండలంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే అట్టాడ జనార్ధన నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా కొవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు.
తెదేపా ద్విచ్రక్ర వాహన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు