భారతీయ జనతా పార్టీ తలపెట్టిన చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భాజపా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యనేతలను గృహ నిర్భంధం చేశారు. వీరఘట్టంలో రోడ్డుపై బైఠాయించిన నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా.. అక్కడ ధర్నా చేపట్టారు. మందసలో ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని పాలకొండ, సీతంపేట, గార, కోటబొమ్మాళితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా భాజపా నాయకులు రామతీర్థం వెళ్లకుండా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు.
చలో రామతీర్థం.. భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు - chalo ramatheertam issue news
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన చలో రామతీర్థం పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేశారు.
చలో రామతీర్థం కార్యక్రమంలో పాల్గొన్న భాజపా నేతలు