శ్రీకాకుళం జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఇమ్యూనోగ్లోబులిన్, వ్యక్తి రోగ నిరోధక స్దాయి, వైరస్, బాక్టీరియా వంటి రోగ నిరోధక కారకాలను ఎదుర్కొనే శక్తిని పరిశీలించే ఎలిసా రీడర్ యంత్రాన్ని నెలకొల్పారు. ఈ యంత్రాన్ని కలెక్టర్ నివాస్ తనిఖీ చేశారు.
'రెండు రోజుల్లో ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తెస్తాం' - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో ప్లాస్మాథెరపీని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. రెండు రోజులలో ప్లాస్మా థెరపీని అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
బలగలో ఉన్న లయన్స్ బ్లడ్ బ్యాంకును సందర్శించారు. లయన్స్ బ్లడ్ బ్యాంకులో రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసే సింగ్ డోనర్ ప్లేట్ లెట్స్ యంత్రాన్ని పరిశీలించారు. ఎస్‌డీపీ ద్వారా రక్త దానం చేసిన అనంతరం రక్తపు యూనిట్ నుండి ప్లాస్మా వేరు చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు. కరోనాతో ఎవరూ మరణించకుండా ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్మా యూనిట్లను కొవిడ్ ఆసుపత్రుల్లో నెలకొల్పడం ద్వారా ప్లాస్మా థెరపీని అందించుటకు అవకాశం ఉంటుందన్నారు. కొవిడ్ నుండి కోలుకున్న వ్యక్తుల నుండి రక్త సేకరణ చేయడం జరుగుతుందని కలెక్టర్ నివాస్ తెలిపారు.
ఇదీ చదవండి రన్‌వే నుంచి లోయలో పడి రెండు ముక్కలైన విమానం