ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్చాపురంలో మున్సిపల్ చైర్ పర్సన్​గా పిలక రాజ్యలక్ష్మి - today Ichapuram Municipal Chairperson election at srikakulam district news

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్​గా పిలక రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు. 23 వార్డుల్లో వైకాపా 15 వార్డుల్లో, రెండు చోట్లు ఇతరులు విజయం సాధించారు. ఆ ఇద్దరు వైకాపాకు మద్దతు ఇవ్వడంతో దీంతో ఇచ్చాపురంలో మున్సిపల్ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకుంది.

Pilaka Rajyalakshmi is the Municipal Chairperson in Ichapuram
ఇచ్చాపురంలో మున్సిపల్ చైర్ పర్సన్​గా పిలక రాజ్యలక్ష్మి

By

Published : Mar 18, 2021, 3:42 PM IST


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మున్సిపల్ చైర్ పర్సన్​గా పిలక రాజ్యలక్ష్మిని ఎన్నుకొన్నారు. వైస్ చైర్ పర్సన్​గా ఉలాల భారతి దివ్య ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా పార్టీ 23 వార్డుల్లో పోటీచేసి 15 స్థానాల్లో విజయం సాధించగా.. రెండు చోట్ల ఇతరులు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వైకాపాకు మద్దతివ్వటంతో.. ఆ సంఖ్య 17కు పెరిగింది. పిలక పోలవరం కోడలు పిలక రాజ్యలక్ష్మి రెండోసారి మున్సిపల్ చైర్ పర్సన్​గా ఎన్నికయ్యారు. గురువారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో.. 23 మంది కౌన్సిలర్లు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్పర్సన్ అభ్యర్థిని ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొని.. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థి భారతి దివ్యకి అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details