లాక్డౌన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో భక్తులకు అనుమతి నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపులో దేవాలయాలకు అనుమతులు వస్తాయని... ఆ దిశగా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సూర్య దేవాలయానికి వచ్చే భక్తులు... భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తర్వాత భక్తులను అనుమతిస్తామని ఈవో హరసూర్య ప్రకాష్ తెలిపారు.
అరసవల్లిలో ఆలయంలో ముందస్తుగా భౌతికదూరం గీతలు - అరసవల్లిలో లాక్డౌన్
దేశంలో లాక్డౌన్ కారణంగా దేవాలయాలకు భక్తులను అనుమతించడం లేదు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులో దేవాలయాలకు అనుమతులు వస్తాయని... ఇప్పటినుంచే ముందస్తు చర్యగా భౌతికదూరం మార్కులను గీస్తున్నారు.

అరసవల్లిలో ఆలయంలో ముందస్తుగా భౌతికదూరం గీతలు