Person Died Who Pushed From the Bus to Out Side: ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చాడు. పనుందని ఇంటికి వెళ్లాలని ఫ్రెండ్స్‌కి చెప్పడంతో వారు బస్సు ఎక్కించారు. అయితే బస్సు డ్రైవర్ టికెట్ డబ్బులు అడగడంతో తన స్నేహితులు ఫోన్‌పే చేస్తారు అని చెప్పారు. ఎంతసేపటికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ యువకుడిని అడగగా స్నేహితుల మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. బస్సు దిగిన తర్వాత ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఆ యువకుడిని డ్రైవర్, క్లీనర్ కలిసి బస్సులో నుంచి బయటకు తోశారు. ఆ ఘటనలో అతను మృతి చెందాడు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి కూడలి సమీపంలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి విశాఖపట్నం మధురవాడ ప్రాంతానికి చెందిన గేదెల భరత్ కుమార్(27)గా పోలీసులు గుర్తించారు. తాజాగా ఆ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్ కుమార్ ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి తన స్నేహితులతో కారులో శ్రీకాకుళం వచ్చాడు. అనంతరం పనుందని, ఇంటికి తిరిగి వెళ్లాలని తన స్నేహితులతో చెప్పడంతో వారు తెల్లవారుజామున భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో నవ భారత్ కూడలి వద్ద ఎక్కించారు. అనంతరం భరత్ కుమార్‌ను బస్సు క్లీనర్ బొమ్మాళి అప్పన్న, డ్రైవర్ రామకృష్ణ ఛార్జీ డబ్బులు రూ.200 ఇమ్మని అడిగారు. తన స్నేహితులు ఫోన్‌పే చేస్తారని చెప్పాడు. ఎంతసేపటికి డబ్బులు రాకపోడంతో మరోసారి అడిగారు. స్నేహితుల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని విశాఖ వెళ్లిన తరువాత ఇస్తానని చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలైంది.