శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురంలో విషాదం జరిగింది. ఎస్సీ వీధికి చెందిన మాధవ్ నాయక్ అనే వ్యక్తి అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. గురువారం రాత్రి గ్రామంలో స్నేహితులతో తిరుగుతూ సరదాగా గడిపిన నాయక్... తెల్లవారేసరికి కాలిపోయి.. జీడి తోటలో శవమై కనిపించాడు. ఉదయం తోటలకు వచ్చిన రైతులు కొంతమంది మృతి చెందిన నాయక్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన బారువ ఎస్సై నారాయణస్వామి.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాయక్ మృతికి గల కారణాలపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రంతా సరదాగా.. తెల్లవారే సరికి తోటలో శవంగా! - శ్రీకాకుళం జిల్లాలో వ్యక్తి మృతి వార్తలు
రాత్రంతా స్నేహితులతో సరదాగా గడిపాడు. తెల్లవారేసరికి జీడితోటలో.. కాలిపోయి శవమై కనిపించాడు. అసలేమైంది? ఎక్కడ జరిగింది?

person dead body was found in the Cashew garden at bathupuram in srikakulam