శ్రీకాకుళం జిల్లాలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రజలు
శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరకులు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో మాంసం, చేపల అమ్మకాలకు అనుమతులివ్వడంతో అక్కడ కూడా వరస క్రమంలో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతులు ఉండడం వల్ల మార్కెట్లు రద్దీగా మారాయి.