ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంతటి ఓర్పు.. ఎంతటి నిబద్ధత..!

మద్యం దుకాణాలు మాములుగా ఉదయం 11 గంటలకు తెరుచుకుంటాయి. అయితే పెరిగిన మద్యం ధరలు అమల్లోకి రావడం లేటయిన కారణంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు దుకాణాలు తెరిచారు. అయినా సరే. మందుబాబులు మాత్రం ఏ మాత్రం ఓపిక కోల్పోలేదు. తెల్లవారుజామునుంచే షాపుల ముందు నిలబడ్డారు. మండే ఎండలో కాసేపయినా పక్కకు వెళ్లకుండా దుకాణాలు తెరిచేవరకూ నిరీక్షిస్తూ ఉన్నారు.

people wait on hours for opens wine shops in state
రాష్ట్రంలో రెండోరోజు తెరుచుకున్న మద్యం దుకాణాలు

By

Published : May 5, 2020, 3:27 PM IST

మద్యం ధరలు మళ్లీ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కొత్త మద్యం ధరలతో జీవోను జారీ చేసింది. దానికి అనుగుణంగా 2 గంటల నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే తెల్లవారుజామునే మద్యం ప్రియులు దుకాణాల ముందు వరుసలు కట్టారు.

మాములుగా ఉదయం 11 గంటలకు తెరుచుకోవాల్సిన షాపులు జీవో లేటవడం కారణంగా తెరుచుకోలేదు. అయినా సరే మందుబాబులు మండుటెండలో సైతం అలాగే నిలబడ్డారు. ఎండ మండుతున్నా, చెమటలు కక్కుతున్నా, వరుస తప్పితే ఎక్కడ వేరొకరు తమ స్థానాన్ని ఆక్రమిస్తారో అన్న భయంతో, ఎంతో నిబద్ధతగా నిరీక్షిస్తూ నిలుచున్నారు.

ABOUT THE AUTHOR

...view details