శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తరోడ్డు వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దిల్లీలో లక్షల మంది రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మండిపడ్డారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలతోపాటుగా విద్యుత్ చట్ట సవరణ 2020 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో పాటుగా పలు రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా నిరసనలు - ఢిల్లీలో రైతుల ఆందోళన తాజా వార్తలు
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా శ్రీకాకుళంలో రైతు సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. రైతులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని నాయకులు మండిపడ్డారు.
ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల నిరసన