ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంలో భాగంగా.. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. ఈ క్రమంలో మహిళలు ఆధార్ కార్డులను నవీకరించుకునేందుకు బారులు తీరారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కేంద్రం వద్ద నిరీక్షించారు.
ఆధార్ సెంటర్ వద్ద బారులు తీరిన మహిళలు - ఆమదాలవలసలో ఆధార్ కేంద్రం వద్ద అధిక జనం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంలో భాగంగా.. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడంతో మహిళలు ఆధార్ కార్డులను నవీకరించుకునేందుకు అధిక మంది వచ్చారు.
ఆధార్ సెంటర్
ఇప్పటికే పట్టణంలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సీఐ ప్రసాదరావు, ఎస్సై కోటేశ్వరరావు ఆధార్ సెంటర్ వద్దకు చేరుకొని నిబంధనలు పాటించాలని.. దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండీ..ఒకరి పాపం..ఎందరికో శాపం..