కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నిబంధన శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వైరస్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఒకే చోట గుంపులుగా చేరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
లాక్డౌన్ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం - lock down detailes in ap
ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న లాక్డౌన్ శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ నిబంధనపై కనీస అవగాహన లేనందున వారు.. సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా గుమికూడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో లాక్డౌన్ను పట్టించుకోని ప్రజలు