శ్రీకాకుళం జిల్లాలోని ఆధార్ కేంద్రాల వద్ద నిత్యం వేలాది మంది సవరణల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నర్సన్నపేట మండలంలోని ఆంధ్రబ్యాంకు ఆవరణలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రం వద్ద బుధవారం వందల సంఖ్యలో జనం చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల నుంచి వృద్ధుల పడిగాపులు కాశారు. ఆధార్లో సవరణల కోసం వచ్చేవారి సంఖ్య అధికంగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఆధార్లో సవరణల కోసం అవస్థలు.. - ఆధార్ నమోదు కేంద్రాల వద్ద భారీ జనం
ఆధార్లో సవరణల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 74 ఆధార్ కేంద్రాలు ఉండగా.. ఇందులో కొన్ని మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి కావడంతో నిత్యం ఆధార్ కేంద్రాల వద్ద జనం భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. చలి, ఎండ అని లెక్క చేయకుండా క్యూలైన్లలో రోజంతా నిలుచుంటున్నారు.

ఆధార్ కేంద్రం వద్ద క్యూ కట్టిన జనాలు