శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘం సభ్యులు కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి రూ.55,000 నగదును స్పీకర్ తమ్మినేని సీతారామ్కి అందించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ తమ్మినేని సూచించారు. వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటానికి దాతలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.
కరోనా నివారణ కోసం రూ.55 వేల విరాళం అందజేత - donations for corona preventions news
కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘ సభ్యులు కరోనా నివారణ కోసం రూ.55 వేల చెక్కును స్పీకర్ తమ్మినేనికి అందజేశారు.
కరోనా నివారణ కోసం రూ.55,000 విరాళం అందజేత