ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు మృతి - vyra

రెండు వారాల్లో పెళ్లిపీటలెక్కాల్సిన ఓ  యువకుడు వైరా జలాశయంలో శవంగా తేలాడు. తన పెళ్లికి రావాలంటూ తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచిన మరుసటి రోజే అనుకోని రీతిలో మృత్యుఒడి చేరాడు.  వైరా ఎస్‌బీఐలో క్లర్కుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

యువకుడు మృతి

By

Published : Mar 13, 2019, 11:51 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన నవీన్‌కుమార్‌ ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌లో ఎస్​బీఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరా శాఖకు బదిలీపై వచ్చాడు. ఈనెల 29న విజయనగరం జిల్లా గరివిడిలో వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసకుంటున్న క్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 12న విధులకు హాజరై తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి తన గదికి వెళ్లిపోయాడు.

పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు మృతి

అసలేం జరిగింది...?

తన గదిలోనే పర్సు, చరవాణి వదిలేసి బయటకు వెళ్లాడు. అతడితో పాటు ఉంటున్న మరో ఉద్యోగి కాల్​ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా కనిపించలేదు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో 13న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు వైరా జలాశయంలో యువకుడి మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడి వెళ్లి చూడగా అది నవీన్​కుమార్​దేనని నిర్ధారించారు.

కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంతలోనేనవీన్​కుమార్ మృతిచెందటం​పై కుటుంబ సభ్యులుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి పట్ల పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి:సాగర్​కాలువలో పడి మెడికో విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details