పాతపట్నం బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. జిల్లాలో ఒకే కుటుంబానికి చెందినవారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు. జిల్లాలో అపారమైన సాగునీటి వనరులు ఉన్నప్పటికీ... రైతాంగానికి అవసరమైన సాగునీటి అందించడంలో ప్రజా ప్రతినిధులు వైఫల్యం చెందారన్నారు. నిర్వాసిత ప్రాంతాల నుంచి సమస్యల తెలిసిన వ్యక్తే పాతపట్నం జనసేన అభ్యర్థిగా ఉన్నాడన్నారు.
ఇవి చూడండి...