శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ఆర్మీ జవాన్ కె. కృష్ణారావు (40) ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. కృష్ణారావు అమృత్సర్ లో విధులు నిర్వహించేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మూడు రోజులు క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి మృతి దేహం స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. పోలీసులు పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.