Panchayats in trouble with government mistakes: రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు పంచాయతీలకు శాపంగా మారాయి. కేంద్రం నిధులు కూడా సర్కారు నిర్వాకంతో పంచాయతీలకు రాకుండా నిలిచిపోతున్నాయి. 2020-21లో మొదలైన 15వ ఆర్థిక సంఘం 2025 -26తో ముగియనుంది. ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 10 వేల 231 కోట్ల సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
Panchayats Funds Diverted in AP :పంచాయతీలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధులపైనా కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడం ద్వారా పంచాయతీలను ఇబ్బందులకు గురి చేసింది. 14,15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి ఇప్పటివరకు 1,351.45 కోట్లకుపైగానిధులను పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించింది. ఈ నిధులు 8,629 కోట్లు ఉంటాయని సర్పంచుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Diverted Panchayat Funds: ఇదేం సర్దు'పోటు' ?.. 5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు
AP Sarpanches Warning to CM Jagan :నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచుల ఫిర్యాదుపై కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి విజయ్‌కుమార్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఇటీవల పర్యటించారు. నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరడంతో పాటు 2022-23 సంవత్సరానికి రెండో విడతగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 717.70 కోట్లను ప్రస్తుతానికి నిలిపివేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుండగా ..రెండు విడతల్లో విడుదల చేయాల్సిన 2,031 కోట్లకు అతీగతీలేదు.
YSRCP Government on Panchayats Funds :పంచాయతీలకు సంబంధించిన ప్రతివిషయంలోనూ ఆర్థిక సంఘం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూనే వచ్చింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమవ్వాలి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించే వీలుండదన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కానీ ఏడాదిన్నర తర్వాత గానీ రాష్ట్రంలో ఇది అమలు కాలేదు. బ్యాంకు ఖాతా తెరిపించకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించాకే వాటిని రాష్ట్రం అమలు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా..వాటినీ ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
నిధులను నిలిపివేస్తామని కేంద్రం అల్టిమేటం :సాధారణంగా స్థానిక సంస్థల పరిధిలో నుంచి వివిధ పద్దుల కింద ప్రభుత్వానికి జమయ్యే ఆదాయంలో ఎంత మొత్తం పంచాయతీలకు కేటాయించాలో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. ఈ ఆదేశాలను సైతం రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో అమలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేస్తామని కేంద్రం అల్టిమేటం ఇచ్చాకే ఐదో ఆర్థిక సంఘం ఏర్పాటు చేసింది.