గ్రామ సచివాలయ పనులను పరిశీలించిన చీఫ్ ఇంజినీర్ - panchayathi raj chief Engineer visited srikakulam district
శ్రీకాకుళం జిల్లాలోని సత్యవరం, దేశవానిపేట గ్రామ సచివాలయాల పనులను పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణారెడ్డి పరిశీలించారు.
గ్రామ సచివాలయ పనులను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.కృష్ణారెడ్డి పర్యటించారు. సత్యవరం, దేశవానిపేట గ్రామ సచివాలయాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ సహాయకులతో ఆయన మాట్లాడుతూ... పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.ఎస్.ఆర్ గుప్తా, డీఈఈ రామం, ఏఈ రమేశ్ తదితరులు ఉన్నారు.