ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు జోరుగా నామినేషన్లు - శ్రీకాకుళం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగాడం మండలాల్లో పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థుల వెంట మద్దతుగా.. వారి అనుచరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

panchayath election nominations
నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు

By

Published : Feb 10, 2021, 7:13 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాలుగో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రణస్థలం 31, ఎచ్చెర్ల 26, జి.సిగాడంలో 31 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 888 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ మూడు మండలాల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి.

పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థుల వెంట మద్దతుగా అనుచరులు భారీగా తరలివెళ్లారు. రణస్థలం, జెఆర్ పురం పంచాయతీల నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా పిన్నింటి భానోజీ రావు, కొయ్యాన దివ్యలకు మద్దతుగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు వెంట ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details