కార్యదర్శులకు ఉన్న డీడీవో పవర్ రద్దుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 2ను తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయం నుంచి సమర్థవంతంగా పని చేస్తున్నామని.. ఈ తరుణంలో తమను డీడీవో బాధ్యతల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు సింహాచలం ప్రశ్నించారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 అమలు చేసి కార్యదర్శులకు ఉన్న డీడీవో బాధ్యతలు వీఆర్వోలకు అప్పగిస్తూ.. జీవో నంబరు 2ను రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది. దీనికి నిరసనగా రాష్ట్ర పంచాయతీ సంఘ ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన చేపట్టినట్లు కార్యదర్శులు తెలిపారు.