ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాలకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి' - శ్రీకాకుళంలోని పాలకొండ వార్తలు

జిల్లాల పునర్విభజన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. నది ప్రవాహక ప్రాంతం, పుష్కలంగా పంటలు పండుతూ, ప్రత్యేకమైన నైసర్గిక స్వరూపం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

palakonda should made as seperate district says palakonda committe members
పాలకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి

By

Published : Aug 12, 2020, 5:00 PM IST

జిల్లాల పునర్విభజన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి భౌగోళిక స్వరూపంగా ఉన్న పాలకొండను ఎదో ఒక జిల్లాతో అనుసంధానం చేసి నడిపించే ఆలోచన మంచిది కాదని సాధన సమితి సభ్యులు నూతలపాటి భరత్ భూషణ్ అన్నారు.

నది ప్రవాహక ప్రాంతం, పుష్కలంగా పంటలు పండుతూ, ప్రత్యేకమైన నైసర్గిక స్వరూపం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాలకొండ ప్రత్యేక జిల్లా సాధన కోసం ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని సాధన సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details