ఇంటింటి సర్వే సక్రమంగా చేయకుండా... కూర్చొని నివేదిక ఇస్తే సహించబోయేది లేదని పాలకొండ ఆర్డీవో టీబీఎస్జీ కుమార్ కింది స్థాయి అధికారులను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన వైద్యులు, అడ్మిన్లు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న స్మార్ట్ఫోన్ల సర్వే నివేదికలను ఆర్డీవో సమీక్షించి సిబ్బందిపై మండిపడ్డారు. నివేదికలు చూస్తే ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించకుండా ఇంటి వద్దే కూర్చుని చేసినట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇంటింటి సర్వేను సక్రమంగా నిర్వహించండి' - palakonda rdo latest meeting news in palakonda
ఆరోగ్య సేతు యాప్ నిమిత్తం ఇంటింటి సర్వేను సక్రమంగా నిర్వహించకుండా... ఇంటి వద్దే ఉండి నివేదక ఇస్తే సహించేది లేదని పాలకొండ ఆర్డీవో కింది స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నాలుగువేల స్మార్ట్ఫోన్లు ఉన్నట్లే అధికారులు గుర్తించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
పాలకొండ ఆర్డీవో టీబీఎస్జీ కుమార్ సమీక్ష సమావేశం
మరో రెండు రోజుల్లో తనకు పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిబ్బందిని ఆర్డీవో ఆదేశించారు. పట్టణ వ్యాప్తంగా నాలుగువేల స్మార్ట్ఫోన్లు ఉన్నట్లే అధికారులు గుర్తించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.