శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా.. 5 నెలల క్రితం ఆమెపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలిక గర్భం దాల్చింది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
బాలికపై అత్యాచారం కేసు.. విచారిస్తున్న పాలకొండ పోలీసులు - శ్రీకాకుళం జిల్లా నేర వార్తలు
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని చాపరలో బాలికపై జరిగిన అత్యాచారం కేసును పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
బాలికపై అత్యాచారం కేసును విచారిస్తున్న పాలకొండ పోలీసులు