రుతుపవనాల ప్రభావంతో...నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. వ్యవసాయం చేయడానికి కావల్సిన నీరు దొరికినట్టేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాలకొండలో వర్షం.. సంబరాల్లో జనం - శ్రీకాకుళం జిల్లా పాలకొండ
నిన్న మెున్నటి వరకు ఎండల తాకిడికి విలవిలలాడిన ప్రజలు... ఇప్పుడు వర్షంలో తడిసిముద్దవుతున్నారు. సాగునీరు సమకూరిందని రైతన్నలు సంబరపడిపోతున్నారు.
పాలకొండలో కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు