శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాన్ని అగ్నిమాపక శాఖ అధికారి బలరాం, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ సందర్శించారు. కొవిడ్ కేంద్రంలో భద్రత చర్యల్లో భాగంగా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో 24 సేఫ్టీ సిలిండర్ కొరత ఉందని అధికారులు గుర్తించారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ తెలిపారు.
కొవిడ్ కేంద్రంలో భద్రతను పరిశీలించిన అధికారులు - palakonda area hospital latest news
పాలకొండ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రంలో భద్రతను అగ్నిమాపక శాఖ అధికారి బలరాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర కుమార్ పరిశీలించారు. కొవిడ్ కేంద్రంలో అన్ని విధాలుగా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
కొవిడ్ కేంద్రం భద్రతా చర్యలను పరిశీలిస్తున్న అధికారులు