ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులు ఆందోళన చెందవద్దు.. ప్రతి ధాన్యం గింజ కొంటాం' - టెక్కలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ శ్రీనివాసులు

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులెవరూ ఆందోళన పడొద్దనీ.. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. టెక్కలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

paddy purchase centres open at tekkali srikakulam district
టెక్కలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

By

Published : Apr 21, 2020, 7:36 PM IST

ర‌బీ సీజ‌న్‌కు సంబంధించి శ్రీకాకుళం జిల్లా టెక్కలి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని.. రైతులెవరూ ఆందోళన చెందవద్దని సంయుక్త కలెక్టర్ కె. శ్రీనివాసులు అన్నారు. టెక్కలి మండలం పెద్దసాన, నందిగాం మండలంలోని పెంటూరు గ్రామాన్ని సందర్శించారు. ప్రాథమిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంస్థ‌లు, డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మ‌ద్ద‌తు ధ‌ర సాధార‌ణ ర‌కం ధాన్యానికి రూ.1815, ఏ-గ్రేడ్ ర‌కానికి రూ.1835 చెల్లిస్తామన్నారు. నాణ్య‌త‌, తేమ‌ శాతాన్ని కొలిచేందుకు సాంకేతిక నిపుణుల‌ను కొనుగోలు కేంద్రాల‌ వద్ద నియ‌మించినట్లు తెలిపారు. రైతుల వ‌ద్ద‌నుంచి ధాన్యం సేక‌రించిన తరువాత వీలైనంత వెంటనే న‌గ‌దు చెల్లిస్తామన్నారు. అనంతరం నందిగాం మండల కేంద్రంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి వసతి పొందుతున్న వారికి ప్రభుత్వం తరపున దుస్తులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details