ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేట కూలీలకు ఊరట - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని పునరావాస కేంద్రం వద్ద సోమవారం ఆందోళనకి దిగిన వలస కార్మికులకు ఊరట లభించింది. స్థానిక ప్రత్యేక అధికారి, సమస్యను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లగా...యుద్ధ ప్రాతిపదికన 53 మందికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల​ ఫలితాలు విడుదల చేసి, వారిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపారు.

migrent workers went to their native places at srikakulam
వలస కూలీల ఆవేదనకి ఊరట

By

Published : Jun 9, 2020, 12:22 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఆందోళనకి దిగిన వలస కార్మికులకు ఎట్టకేలకు ఊరట లభించింది. వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు జిల్లా అధికారులు.

21 రోజులుగా పునరావాస కేంద్రాల్లో ఉంచి ఇళ్లకు పంపించలేదని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో ఉంటున్న కూలీలు ఆందోళన చేశారు. ప్రత్యేక అధికారి ఆర్​.వెంకటరామన్​ జోక్యం చేసుకుని... సమస్యలను వీలైన త్వరగా పరిష్కామని హామీ ఇచ్చారు. ఆయన భరోసాతో అప్పటికి శాంతించారు కూలీలు. ఆయన వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్​ 53 మందికి పరీక్షలు చేసి స్వస్థలాలకు పంపించాలని ఆదేశించారు.

కలెక్టర్​ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు... యుద్ధప్రాతిపదికన 53 మందికి వలస కార్మికులకు కరోనా పరీక్షలు నిరవహించారు. ఫలితాలు వచ్చాక... వారిందర్నీ ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్లకు పంపించారు.

ఇవీ చూడండి

1 నుంచి 10 తరగతుల వరకు టీవీ పాఠాలు

ABOUT THE AUTHOR

...view details