శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తునట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 25 మంది పిల్లలను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రోజు నుంచి రేపటి సాయంత్రం 7గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.
వీధి బాలలు, అనాధలతో పాటు నిరాదరణకు గురైన పిల్లల పరిరక్షణే లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. అలాగే పిలల్లు కరోనా వైరస్ బారిన పడకుండా ఇది దోహద పడుతుందన్నారు. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపాలైన బాలలు, హోటళ్లు, రెస్టారెంట్‌ల్లో పనులు చేస్తూ.. రోడ్లపై కాలం వెళ్లదీస్తున్న బాలలను గుర్తిస్తామన్నారు.