శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ గురించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులకు, పిల్లల తల్లిదండ్రులకు ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. ఈ దాడులల్లో 137 మంది బాలల గుర్తించామన్నారు. వీధి బాలలు, అనాథలు, నిరాదరణకు గురైన పిల్లల పరిరక్షణ, కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు. చాలా చోట్ల కార్మికులుగా మగ్గుతున్న బాలల కోసం పోలీసులు జల్లెడపట్టి విముక్తి కల్పించారన్నారు. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్‌లో పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బాలలను గుర్తించామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్..137 మంది బాలలు గుర్తింపు
శ్రీకాకుళం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్‌ను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ దాడుల్లో 137 మంది బాలలను గుర్తించామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్