ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం గిరిజన ఉత్పత్తులు.. ఇక ఆన్​లైన్​లోనే - శ్రీకాకుళం గిరిజనులు వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో గిరిజిన ఉత్పత్తులను ఆన్​లైన్ ద్వారా అమ్ముకునే విధానాన్ని రూపొందించారు. కలెక్టర్ నివాస్ చేతుల మీదుగా ఈ యాప్​ని ప్రారంభించారు. కొనుక్కోవాలనుకునేవారు ఆర్డర్ చేసుకోవచ్చని సూచించారు.

online app started by collector nivas for srikakulam Tribal products
online app started by collector nivas for srikakulam Tribal products

By

Published : May 10, 2020, 9:33 AM IST

Updated : May 10, 2020, 9:58 AM IST

గిరిజన ఉత్పత్తులను... ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు... శ్రీకాకుళం జిల్లా శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆన్‌లైన్‌ విక్రయాల యాప్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గిరిజన ప్రధాన ఉత్పత్తులైన కొండచీపుర్లు, పైనాపిల్ విక్రయాలను.. స్వయం సహాయక బృందాల అనుసంధానంతో ఈ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు. కొనుక్కోవాలనుకునేవారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని ఐటీడీఏ పీవో తెలిపారు. సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వెలుగు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారన్నారు.

Last Updated : May 10, 2020, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details