ఉల్లిపాయలకు ఎన్నడూ లేని విధంగా రేటు పెరగడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో జనం రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ క్యూలైన్లలో గంటల తరబడి ఉల్లి కోసం వేచి చూస్తున్నారు. ఇంతగా ఎదురు చూసినా ఉల్లి దొరకడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉల్లిని కొందరు వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లిని అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
రైతుబజార్ల వద్ద నో స్టాక్ బోర్డులు.. ఉల్లి కోసం ప్రజల అవస్థలు - onions no stock in srikakulam district
ఉల్లిపాయలు స్టాకు లేదంటూ శ్రీకాకుళం, ఆముదాలవలస, కోటబొమ్మాళి రైతుబజార్లలో బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాయితీ ఉల్లి కోసం క్యూలైన్లలో నిల్చున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి పక్కదారి పడుతోందని జనం గగ్గోలు పెడుతున్నారు.
రైతుబజార్లలో ఉల్లి స్టాక్ లేదంటూ బోర్డులు