శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా గ్రామంలో ఆరోగ్య సేతు యాప్ అలజడి రేపింది. చికెన్ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి ఇటీవల స్మార్ట్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇన్స్టాల్ చేసిన సమయంలో ఆంగ్ల భాషను ఎంచుకున్నారు. అతనికి అంతగా అవగాహన లేక ప్రతి ప్రశ్నకు 'ఎస్' అనే సమాధానం ఎంచుకున్నారు. దీంతో అతనికి హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఆంగ్లం రాక.. కరోనా వచ్చింది! - srikakulam district news
చేతిలో స్మార్ట్ఫోన్ ఉందని... భాషపై అవగాహన లేకపోయిన ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ప్రతి ప్రశ్నకు 'ఎస్'... 'ఎస్' అంటూ సమాధానం నొక్కుకుంటూ పోయాడు. అలా చేయటంతో కరోనాని నొక్కి తెచ్చుకున్నాడు. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది..!
అలజడి రేపిన 'ఆరోగ్య సేతు' యాప్
'మీకు కరోనా పాజిటివ్ వచ్చింది.... దగ్గరిలో ఉన్న కొవిడ్ ఆసుపత్రికి వెళ్లండి' అని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఈ సమాచారంతో అతని ఇంటి వద్దకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామవాలంటీర్లు చేరుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారి అలజడి రేగింది. ఈ వదంతు వ్యాప్తి చెందడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టెక్కలి కొవిడ్ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆ వ్యక్తికి సూచించారు.
Last Updated : Jun 10, 2020, 5:51 PM IST