ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశా రైలు ప్రమాదం.. సిక్కోలు వాసి మృతి.. మహిళకు తీవ్ర గాయాలు - ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు వ్యక్తులు

odisha train accident: ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుడు ఒడిశా నుంచి పింఛను తీసుకోవడానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన మహిళ అమ్మఒడి వేలిముద్ర కోసం వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదంలో గాయపడినట్లు అధికారులు తెలిపారు.

accidentttrain accident
train accidentrain

By

Published : Jun 3, 2023, 10:59 PM IST

A man from Andhra Pradesh was killed in odisha train accident: ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో విషాదం నెలకొంది. మత్స్యకార కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, మరో మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి. ఫించన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.

సంతబొమ్మాళి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సోడిపల్లి గురుమూర్తి (63) పింఛను తీసుకోవడానికి మే 30న స్వగ్రామానికి వచ్చారు. పింఛన్ అందుకుని తిరిగి వెళుతూ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకు దెరువు కోసం 30 ఏళ్ల క్రితం ఒడిశాలో బాలసోర్ వెళ్లి అక్కడే ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని స్థానికులు తెలిపారు. 2వ తేదీన జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో... బాలాసోర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Railway Helpline Numbers: రైలు ప్రమాదంతో ఏపీ రైల్వేశాఖ అప్రమత్తం.. హెల్ప్​లైన్‌ కేంద్రాలు

తిరుగు ప్రయాణంలో పలాస రైల్వేస్టేషన్​లో యశ్వంత్​పూర్-హావ్​డా రైలు ఎక్కి బాలసోర్ వరకు ప్రయాణం చేస్తుండుగా శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో భోగీల మధ్య ఇరుక్కొని అక్కడిక్కడే మృతి చెందారు. గత ముప్పై ఏళ్లుగా బాలసోర్​లో కుటుంబ సభ్యులతో ఉంటూ చేపలు పడుతూ, వలలు అల్లుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రమణమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అమ్మఒడి వేలిముద్రకు వచ్చి తీవ్రంగా గాయపడి.. సంతబొమ్మాళి మండలం ఎస్.బి.కొత్తూరు పంచాయతీ ఎం కొత్తూరు గ్రామానికి చెందిన కారాడ పూజ సైతం ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలకు, ఎడమ చేతికి బలమైన గాయాలు కావడంతో బాలసోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పూజ ఆమె భర్త శ్రీనివాసరావుతో కలసి బాలసోర్​లో ఉంటున్నారు. భర్త చేపల వేటకు వెళ్లి జీవనోపాధి పొందుతుండగా, పూజ.. చేపలు అమ్ముతూ కుటుంబాన్ని నడిపిస్తున్నారు. మే 29వ తేదీన అమ్మఒడి పథకంలో వేలిముద్ర వేయడానికి ఎం. కొత్తూరు గ్రామానికి చేరుకుంది. పని ముగిసిన అనంతరం ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం పలాస రైల్వేస్టేషన్​లో యశ్వంత్​పూర్​ నుంచి హావ్​డా వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కి ప్రమాణం చేస్తుండగా బహనాగా రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రమాదంలో భోగీల మధ్య పూజ ఇరుక్కుపోయింది. తల, ఇతర శరీర భాగాలకు బలమైన గాయలు కావడంతో... ఆమెను బాలేశ్వర్ ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం పూజ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. పూజ ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీనకుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఒడిశా నుంచి విజయవాడకు చేరుకున్న ప్రత్యేక రైలు.. స్వస్థలాలకు ప్రయాణికులు

ABOUT THE AUTHOR

...view details