ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది.

one person death in different accident at narasannapeta srikakulam district
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

By

Published : Feb 15, 2021, 11:29 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నరసన్నపేటలోని పెద్దవీధికి చెందిన కోట్ని నాగభూషణ ఆయన భార్య లక్ష్మి ఉదయం వాకింగ్​కు వెళుతుండగా.. వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందగా.. నాగభూషణానికి తీవ్ర గాయాలయ్యాయి.

అదేవిధంగా నరసన్నపేట సమీపంలోని ఈదులవలస - రాళ్లపాడు గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పోలాకి మండలం గంటపేట గ్రామానికి చెందిన బాబురావు, వెంకటరమణ, శరత్, వీరబాబు గాయపడ్డారు. వీరిలో వెంకటరమణ, శరత్ పరిస్థితి విష‌మంగాఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. నరసన్నపేట, పోలాకి పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దారి తప్పి.. ప్రమాదానికి చిక్కి

ABOUT THE AUTHOR

...view details