ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ.. వ్యక్తి మృతి - vr gudem crime news

శ్రీకాకుళం జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగన ఘర్షణలో రామారావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తనకి, తన తమ్ముడికి మధ్య ఆస్తి వివాదం ఉండగా.. దానికి కారణం పక్కింటి వారే భావించిన రామారావు.. మద్యం మత్తులో వారితో గొడవ పడ్డాడు. వాళ్లు కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

murdemurderr
murder

By

Published : Jun 12, 2021, 10:58 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వి.ఆర్. గూడెంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సువ్వారి రామారావు(35) అనే వ్యక్తి మృతి చెందాడు.

రామారావు అతని తమ్ముడు రాజుకు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆ వివాదాలకు పక్కింటి వాళ్లే కారణమని రామరావు అనుమానించాడు. మద్యం మత్తులో వారితో గొడవ పడ్డాడు. సూర్యనారాయణ, రాజారావు కర్రతో రామారావు తలపై బలంగా కొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూర్యనారాయణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.లక్ష్మణ్ రావు తెలిపారు.

ఇదీ చదవండి:కన్న తల్లిని వద్దనుకున్నారు.. కనికరం లేకుండా రోడ్డుపై వదిలేశారు!

ABOUT THE AUTHOR

...view details