ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదవిలో ఉన్నా, లేకున్నా ఒకేలా ... - Mandasa Ex surpanch jamuna

ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచిగా ఉన్న ఆమె .... ప్రస్తుతం సాదాసీదాగా జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మందస మేజరు పంచాయతీ మాజీ సర్పంచి సవర జమున.

మందస మేజరు పంచాయతీ
మందస మేజరు పంచాయతీ

By

Published : Feb 3, 2021, 7:55 PM IST

మాజీ సర్పంచి సవర జమున

చిత్రంలో కట్టెలమోపు మోస్తూ వస్తున్న ఈమె మందస మేజరు పంచాయతీ, మాజీ సర్పంచి సవర జమున. ఈమె 2001లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచి అయ్యారు. ఏడాదికి దాదాపు రూ.70 లక్షలు ఆదాయం ఉన్న పంచాయతీకి ఈమె ప్రథమ మహిళ. అయినా ఈమె మాత్రం పదవిలో ఉన్నా, లేకున్నా ఒకేలా జీవిస్తున్నారు. భర్త అనారోగ్యం బారినపడడంతో ఉపాధి పనుల్లో పాల్గొనడంతో పాటు కట్టెలు అమ్ముకొని బతుకు వెళ్లదీస్తున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశారు. ఇద్దరు కుమారులతో కలిసి కూలిపనులు చేసుకుంటున్నారు. సాదాసీదాగా జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details